న్యూజిలాండ్‌ లక్ష్యం 178

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ హఫీజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మహమ్మద్‌ హఫీజ్‌(43), ఇమ్రాన్‌ నజీర్‌(25, శుభారంభాన్నిచ్చారు. 47 పరుగుల మొదటి వికెట్‌ భాగస్వామ్యాన్ని సౌధీ విడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నాజిర్‌ జమ్షెడ్‌(56) అర్ధవతకంతో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. ఆఖర్లో ఉమర్‌ అక్మల్‌(23) ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు జాకబ్‌ ఓరమ్‌, సౌథీ చెరో రెండు, డానియల్‌ వెటోరి, ఫ్రాక్లిన్‌ చరో ఒక వికెట్‌ పడగొట్టారు.