పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే పద్మజ్యోతిలను తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు, తెదేపా వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.