పంట పొలాలకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

 జనం సాక్షి మంథని : యాసంగిలో సాగు చేసిన వరి పంట సాగునీరు అందక బీటలు వేస్తున్నదని , సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి, సూరయ్య పల్లి,రామకృష్ణ పూర్ గ్రామ రైతులు ఎస్ ఆర్ ఎస్ పి ఈఈ ని సోమవారం కలిశారు. మంగళవారం మధ్యాహ్నం నుండి మీ పంట పొలాలకు నీరు అందుతుందని ఎస్సార్ఎస్పీ ఈఈ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, రైతులు తాని ప్రభాకర్, మాదర బోయిన రాజయ్య, ఆకుల మధుకర్,నల్లి లచ్చయ్య,ఆకుల భాస్కర్, కొంత మల్లయ్య, తోట రాజయ్య, మహేందర్, భాస్కర్ల సుధాకర్, రమేష్, రైతులు ఉన్నారు.