పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

 గుడిహత్నూర్: సెప్టెంబర్, 25 జనం సాక్షి)సీఎం కేసీఆర్ మహిళ భాందవుడని పండుగ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు ఆదివారం రోజున మండలంలోని సీతాగొంది రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో  బోథ్ ఎమ్మెల్యే ముఖ్యాతిథిగా పాల్గొని  మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఎంతో గొప్పగా మన వారు జరుపుకుంటున్నారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘానంగా నిర్వహిస్తుందన్నారు  దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సర్కారు వితంతువులు, వృద్దులు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తోందని చెప్పారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద లక్షా116 రూపాయల ఆర్థికసాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిడిఒ సునీత,ఐకేపి ఏపీఎం భగవాండ్లు, సర్పంచులు మాడావి ధనలక్ష్మి, నీలాబాయి, ప్రేమలత, ఎంపీటీసీలు చిట్యాల కృష్ణవేణి, సాగిర్ ఖాన్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీ నారాయణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్2బ్రహ్మానంద్, కో ఆప్షన్ మెంబర్ జమీర్, సీతాగొంది ఉప సర్పంచ్ సంతోష్ గౌడ్, నాయకులు జాదవ్ రమేష్, రాందాస్, జంగు, ఆశన్న యాదవ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు