పక్కాగా పారిశుధ్యం పనులు

share on facebook


చెత్త నిర్వహణ కోసం కార్యాచరణ
వర్మి కంపోస్ట్‌ తయారీతో సమస్యకు చెక్‌
వరంగల్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : పారిశుద్ధ్యం, పరిశుభ్రతతోనే ప్లలెల్లో ప్రజారోగ్యం సాధ్యమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రగతికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందించింది. ఏటేటా మండలాలు, గ్రామాల నుంచి పట్టణాలకు పెరుగుతున్న వలసలను నిరోధించాలంటే పల్లెల్లో పట్టణ వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణంతోపాటు ప్రజల అనారోగ్యానికి దారితీస్తోంది. మున్సిపల్‌, మండల కేంద్రాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొంత మెరుగ్గానే ఉన్నా గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న దృష్ట్యా ఆ వాతావరణం నుంచి ప్రజలను గ్టటెక్కించేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి నిత్యం టన్నులకొద్ది తడి, పొడి చెత్త ఎక్కడిక్కడే పేరుకుపోతున్న గ్రామాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండల కేంద్రాల్లో, గ్రామ పొలిమేరల్లో, ప్రధాన రహదారుల పక్కనే పడేసి అక్కడే కాల్చివేయడాన్ని నిరోధించి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి జిల్లా వ్యాపితంగా వెలువడుతున్న దాదాపు 50మెట్రిక్‌ టన్నుల చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన డంపింగ్‌యార్డు నిర్మాణాలతోపాటు
పంచాయతీకి చెత్త సేకరణ కోసం ఉపాధి నిధులతో రిక్షాలు కొనుగోలు చేసి చెత్త సేకరణకు ముందుకు
వచ్చే వారికి రోజు ఉపాధి కూలీ చెల్లించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే
పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు గుంతల నిర్మా ణం వందశాతం ఉన్న గ్రామాలకు ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశర చేయడంతో ఆమేరకు జిల్లా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే ప్రతీ పంచాయతీలో డంపింగ్‌యార్డు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం జాతీయ ఉపాధిహావిూ పథకం ద్వారా పనులు చేపట్టేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠం భూములు అందుబాటులోఉన్నగ్రామాలకు డంపింగ్‌ యార్డులు మంజూర య్యాయి. డంపింగ్‌యార్డులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోతొలుత ప్రయోగాత్మకంగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. ప్రతీవారం నిర్వహించే గ్రామ సందర్శనలో వరుసగా నాలుగు వారాల పాటు ఎంపిక చేసిన గ్రామాలపై ఆయా ప్రభుత్వ విభాగాల అధికార యంత్రాంగం అంతా వందశాతం మరుగుదొడ్లు, ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతల నిర్మాణం, వీధుల్లో కంపచెట్లు, మురికిచెట్లు లేకుండా చూడటం, డ్రైనేజీల్లో మట్టి, ఇసుక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, వాటర్‌ ట్యాంకులు శుభ్రం గా ఉంచడం, లీకేజీలు లేకుండా నల్లాల పైపులైన్లు ఉండటం, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవడం, ఇంటి, నల్లా పన్నుల చెల్లింపులు వందశాతం ఉండేలా చూస్తారు. ఆయా గ్రామాల్లో కలెక్టర్‌ కూడా పర్యటించి పరిశీలించిన తర్వాత నూరుశాతం పారిశుద్ధ్య గ్రామాలను ప్రకటించి ఒక్కో గ్రామపంచాయతీకి రూ.2లక్షల బహుమతి అందజేస్తారు. దశలవారీగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయ తీలను ఈ విధానం కింద తీసుకొని కొద్దిరోజుల్లోనే జిల్లాను నూరుశాతం పారిశుద్ధ్యంగా ప్రకటించాలని కలెక్టర్‌ పట్టుదలతో అధికార యంత్రాంగాన్ని సవిూక్షలు, సమావేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

Other News

Comments are closed.