పగిలిన మంజీర పైవ్‌లైన్‌

పేట్‌బషీరాబాగ్‌,హైదరాబాద్‌:కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాగ్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా మంగళవారం ఉదయం మంజీర పైవ్‌లైన్‌ పగిలిపోయింది.హైదర్‌నగర్‌ రిజార్యాయర్‌ నుంచి అల్వాల్‌ వెళ్లే ఈ పైవ్‌లైన్‌ పగిలిపోవడంతో భారీగా నీరు పైకి ఎగజిమ్ముతోంది.సమచారం తెలసుకున్న జలమండలి అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు మరమ్మతు పనుల కారణంగా మంగళ,బుధ వారాల్లో కుల్బుల్లాపూర్‌ అల్వాల్‌ ప్రాంతాల్లో నీటిసరఫరా నలిపివేసున్నట్లు తెలిపారు.