పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం


– రబ్బరు పరిశ్రమలో టైర్లకు అంటుకున్న నిప్పు
– మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
– రూ.60-70 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా
– ఘటనా స్థలాన్ని సందర్శించిన ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
పటాన్‌చెరువు, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి) : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలోని అగర్వాల్‌ రబ్బర్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి 2గంటల సమయంలో టైర్లకు మంటలు అంటుకుని పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంగళవారం సాయంత్రం వరకు మంటలు అదుపులోకి వచ్చారు. టైర్లకు మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమైంది. ఈ ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు
ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్‌ సర్క్యూట్‌ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదని, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేసస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే గర్వాల్‌ పరిశ్రమ గోదాంలో జనవరిలో కూడా అగ్నిప్రమాదం సంభవించగా అప్పుడు ఛైర్మన్‌ గుండెపోటుతో చనిపోయారు. ఇపుడు అదే పరిశ్రమలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా కిలోవిూటరు మేర దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 నుంచి 70కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఘటనా స్థలిని పరిశీలించిన ¬ంమంత్రి..
ఎందరో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమ అగ్నిప్రమాదంలో బుగ్గి కావడం పట్ల తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంస్థ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని నుంచి తేరుకునేలోపే మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హావిూ ఇచ్చారు.