పట్టణంలోని డ్రైనేజ్ వ్యవస్థని మెరుగు పరచడానికి కృషి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

 కోదాడ టౌన్ సెప్టెంబర్ 02 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం పరిధి లోని 19వ వార్డ్ లో  మురికి కాలువ సమస్య పైన స్థానికులు ఇచ్చినటు వంటి పిర్యాదు మేరకు చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి  సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం లోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి మా పాలక మండలి కృషి చేస్తున్నదని తెలియచేసారు.వెంటనే స్పందించినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కొల్ల ప్రసన్న లక్ష్మీ కోటిరెడ్డి,మున్సిపల్ అధికారి వరుణ్ ,భ్రమరాంబిక,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.