పట్టా భూముల్లో భారీగా ఇసుకమేటలు

పట్టా భూముల్లో భారీగా ఇసుకమేటలుతీవ్రంగా నష్టపోతున్న రైతాంగంపట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగంహైకోర్టు ఉత్తర్వులు అమలుకు నోచుకోని వైనంఏటూరునాగారం(జనంసాక్షి),ఏప్రిల్04.ఏటూరునాగారం మండలగోదావరి తీర ప్రాంత రైతుల గోస వినే వారే కరువయ్యారు. గోదావరి ఉధృతికి రైతుల పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా వాటిని తొలగించే నాధుడే కరువయ్యారు. వందల ఎకరాల భూమి గోదావరిలో కలిసిపోతున్న చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం పనులు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు ఏకో సెన్సిటివ్ జోన్ పేరుతో తవ్వకాలను అడ్డుకుంది. రైతులకు గతంలోనే ఇచ్చిన పట్టాల అనుకూలంగానే అట్టి భూముల్లో ఇసుక తవ్వకాలు ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు పరిశీలించిన మేరకే అనుమతులు ఇచ్చింది. కానీ అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం రైతులకు శాపంగా మారింది. రైతుల పట్టా భూములనుంచి ఇసుక ఇసుక తవ్వకాలు చేపట్టిన సందర్భాల్లో పనులను అడ్డుకొని వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తుంది. రైతులు పలుమార్లు ఇసుక తవ్వకాలను అడ్డుకోవద్దని కలెక్టర్ స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన గాని ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం రైతుల కోసం పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక బాధిత రైతులందరు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా తీర్పును అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల భూముల్లో పేరుకుపోయిన ఇసుక మేటలుతీసివేస్తే సాగుకు అనుకూలించడంతోపాటు బాధిత రైతంగానికి ఇసుక ద్వారా ఆర్థిక చేయూత అందుతుందని ఆశ పడుతున్న ఫలితం లేకుండా పోతుంది. గత రెండు సంవత్సరాలనుండి అనేక పొంతలు గోదావరి ఇసుక మేటలతో రైతు పట్టా భూముల్లో పంటలు పండించుకోలేని రైతులు.హై కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ కుంటి సాకులుతోరైతుల కడుపులు కొడుతున్నారు. పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలను మెషినరీ లేకుండా తీయ్యాలంటూ తీరకాసు పెడుతున్నారు..ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టే ఇవ్వటం అవసరంలేని అడ్డంకులు పెట్టటం,రైతుల కోసం సీనియర్ అడ్వకేట్ రమేష్ విశ్వనాద్ లు, మూడు సంవత్సరాల అలుపెరుగని పోరాటంరైతుల కోసం  పోరాటం చేస్తున్నారు హైకోర్టులో రైతుల పక్షాన వాదన వినిపిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. రైతుల కోసం మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం జిల్లా యంత్రాంగం పట్టించకపోవడం దారుణమని అన్నారు.కలెక్టర్ చొరవ చూపాలి. బాధిత రైతాంగంఎన్నో ఏళ్లుగా భూములను కోల్పోయిన రైతులు అవస్థలు పడుతున్న ప్రభుత్వం గానీ పాలకులు గాని పట్టించుకోవడంలేదని బాధిత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఇసుక మేటల్ తీస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని రైతులు వాపోతున్నారు. నమ్ముకున్న భూమి ఇసుకమయం కావడంతో జీవన ఉపాధి కరువైందని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవచూపి రైతుల భూముల్లో పేరుకుపోయిన ఇసుకను తీసి ఆదుకోవాలని బాధిత రైతులు శ్రీరాముల ఆనందం,శ్రీనివాస్, చిటమాట ధనలక్ష్మి,బొప్పన శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,ఎర్రమనేని నాగేశ్వరరావు, గీకురి లింగయ్య,గీకూరి పెద్దలక్ష్మి,అలుగు సారయ్య కోరుకుంటున్నారు.