పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

లండన్‌ : ఒలింపిక్స్‌లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెస్‌ ప్రకటించారు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో భారత ఒలింపిక్‌ సభ్యులకు ఇచ్చిన విందులో ఆయన ఈ ప్రకటన చేశారు.