పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలోని పత్తిమిల్లులో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులోని పత్తి బేళ్లు పూర్తిగా దగ్ధమాయ్యాయి. రూ. 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు సిబ్బంది అంచనా వేస్తున్నారు.