పత్తి కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్‌, అక్టోబర్‌ 30: జిల్లాలో కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్‌ యార్డులలో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిపిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు మంగళవారం రైతుల నుంచి కొనుగోల్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. జిల్లాలో మార్కెట్‌ యార్డులలో సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కరీంనగర్‌, చొప్పదండితో పాటు తొమ్మిది మార్కెట్‌ యార్డులలో రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. కరీంనగర్‌, చొప్పదండితో పాటు సిరిసిల్ల, పెద్దపల్లి, జమ్మికుంట, ధర్మారం, గంగాధర, మంథని, గొల్లపల్లి, వేములవాడ, హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులో 160 క్వింటాళ్లు, చొప్పదండి మార్కెట్‌ యార్డులో 300 క్వింటాళ్ల పత్తి మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పత్తిలో చెత్త, చెదారం, తేమ లేకుండా తెచ్చినలో మద్దతు ధర లబించునని తెలిపారు. పత్తి కనీస మద్దతు ధర బన్ని, బ్రహ్న స్టేపుల్‌ పొడవు 29.5, 30.5 ఎం.ఎం మైక్రోవేర్‌ వాల్యూ 35,45 ఉన్నచో రూ.3900 ఎఫ్‌-41/హెచ్‌-777/ జె-34 పత్తిరకం స్టెపుల్‌ పొడవు 24.5-25.5 ఎం.ఎం మైక్రోనేర్‌ వాల్యూ 43-51 ఉన్నచో రూ.3600 ఎంఎస్‌పి లభిస్తుందని తెలిపారు.