మూడేండ్లలో గ్యారెంటీలు అమలు చేస్తం

డిసెంబర్ 07(జనం సాక్షి)కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో ఆదివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన కారణంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిందని, ప్రజా సమస్యలు పట్టించుకోని బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని తెలిపారు.
తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేదని చెప్పారు. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. రెండేండ్ల నుంచి తెలంగాణను పట్టించుకోలేదని, కేంద్రం నుంచి వస్తున్న ప్రాజెక్టులను సైతం అడ్డుకున్నారని విమర్శించారు. మెట్రో, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీపై కిషన్‌రెడ్డి ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని ఆరోపించారు.



