పత్రికలు నిర్భయంగా వార్తలు రాయాలి
విజయక్రాంతి ఆవిష్కరణలో కేంద్రమంత్రి గడ్కరీ
హైదరాబాద్,మే5(జనం సాక్షి): రాజకీయాలు కాకుండా సమాజాభివృద్ధి లక్ష్యంగా పత్రికలు వార్తలు రాయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు వారత్లు అద్దం పట్టాలన్నారు. శనివారం ¬టల్ మారియట్‌లో విజయక్రాంతి దినపత్రికను కేంద్రమంత్రి గడ్కరీ ప్రార్రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్కరీ.. కొత్త పత్రిక నిర్భయంగా, నిష్పక్షపాతంగా వార్తలు రాయాలన్నారు. పత్రికల ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి అవుతోందని, ఎలక్టాన్రిక్ విూడియా వల్ల ప్రింట్ విూడియా ముందుకెళ్లలేకపోతుందన్నారు. తెలంగాణలో సహజ ఇథనాయిల్ తయారీకి చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. నదుల అనుసంధానంతో దక్షిణాది రాష్టాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, ఎల్. రమణ, సీపీఐ నేత నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం,పత్రిక ఎండి రాజం తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని పదవిపై ఆశ లేదు: గడ్కరీ
ప్రధానమంత్రి పదవి కోసం తాను పోటీ పడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి తోసిపుచ్చారు. కేంద్రమంత్రిగా సాధించిన దాంతో సంతృప్తి చెందడం తప్ప ప్రధాని పదవిపై ఎప్పుడూ దృష్టిసారించలేదని స్పష్టంచేశారు. ఆయన ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఏదో ఒకరోజు ప్రధాని పదవిని అలంకరిస్తారని శివసేన నేత, మాజీ సీఎం మనోహర్‌జోషి చేసిన వ్యాఖ్యలపై గడ్కరీ వివరణ ఇచ్చారు. 2019లో ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. మనుషులకు పెద్ద లక్ష్యాలు ఉండాలనే వాదన ఉన్నా, తాను మాత్రం ప్రధాని పదవిని ఆశించడం లేదని మంత్రి తెలిపారు. భాజపాపై మిత్రపక్షాల అసంతృప్తి నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థిగా తన పేరు తెరవిూదకు వస్తున్న వార్తలపై ఇటీవల కూడా గడ్కరీ వివరణ ఇచ్చారు.
———