పదివేల లోపు ర్యాంకు విద్యార్థులకు
ఫీజు రీయింబర్స్మెంట్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 30 (జనంసాక్షి): పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని నిర్ణయం తీసు కున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, 85 కళాశాలల్లో కన్వీనర్ కోట కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నదని అన్నారు. కళాశాలలపై కక్ష తీర్చుకునేందుకే ప్రభుత్వం టాస్క్ఫోర్సును నియమించిందని వస్తున్న వార్తలు అపోహలని ముఖ్యమంత్రి అన్నారు. టాస్క్ఫోర్సు లోని అంశా లను ఆన్లైన్లో ఉంచుతామని సీఎం అన్నారు. విద్యార్థుల ప్రవర్తన, ఎస్ఎంఎస్, పోస్టు కార్డుల ద్వారా తెలపాలన్న నిబందన ఉన్నదని అన్నారు. విద్య, ఉద్యోగాలలో సమతుల్యత ఉండేల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్య మంత్రి తెలిపారు. 2011-12 సంవత్సరంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద 26.23 లక్షల మంది విద్యార్థులకు 3,569 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. గత విద్యా సంవత్సరం కంటే ఈ సారి ఇంజనీరింగ్‌లో ప్రవేశ ప్రక్రియ 24 రోజులు ఆలస్యమైందని అన్నారు. బోధనా ఫీజు 35,000 వేలకు పెంచు తున్నట్లు ముఖ్య మంత్రి తెలిపారు. 85 కళా శాలల్లో విభిన్నమైన ఫీజులు ఉన్నాయని ఆయన అన్నారు. 85 కళాశాలల్లో నుండి లక్షా 5 వేల 52 లక్షల రూపాయల వరకు ఫీజులు ఉన్నా యని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉపకార వేతనాన్ని, బోధనా ఫీజులను వేర్వేరు చేస్తున్నట్లు తెలిపారు. 85 కళాశాలల మినహ మిగిలిన కళా శాల్లో ఎలాంటి సమస్యలు లేవని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన, నియమిం చిన నిబందలను అన్ని కళాశాలలు విధిగా పాటిం చాలని అన్నారు. మరింత మెరుగైన విద్యను అందించేందుకే కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రవేశపె ట్టామని అన్నారు. మేనేజ్మెంట్ కోటాకు ఉన్నత విద్యా మండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నిబందనలను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతిభ ఆధారంగానే ఇంజనీరింగ్‌లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కళాశాల్లో మౌలిక వసతులు, సిబ్బంది వివరాలు సైట్లో తప్పనిసరిగా ఉంచాలని ముఖ్యమంత్రి తెలిపారు.