పద్మభూషణ్‌ అవార్డు ఎంతో సంతోషానిచ్చింది : రామానాయుడు

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించడం తన అదృష్టమని ప్రముఖ సినీ నిర్మాత డా.డి. రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందుకున్న దాదాసాహెజ్‌ పాల్కే అవార్డు కంటే పద్మభూషణ్‌ అవార్డు ఎంతో ఆనందానిచ్చిందన్నారు.  ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వచ్చే ఏడాది ఓ చక్కటి కుటుంబకధా చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ 13 భాషల్లో చిత్రాలను నిర్మించిన రామానాయుడు తాజాగా పంజాబీలో నిర్మించిన చిత్రం వచ్చే నెల 14న విడుదల కాబోతుంది.

తాజావార్తలు