పరకాలను అభివృద్ధి చేయని కొండా దంపతులు

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) :
పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కొనసాగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయక కనీసం పరకాల నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటిని అందించని కొండా దంపతులకు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు సరియైన తీర్పును ఇచ్చారని సాంబారి సమ్మారావు అన్నారు. ఆదివారం పరకాల పట్టణములో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశములో ఆయన మాట్లాడుతూ 60 వేల జనాభా కల్గి ఉన్న పరకాల పట్టణ ప్రజలకు కనీస అవసరా లను తీర్చక, త్రాగడానికి నీరు అందించక సీమాంధ్ర వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ జపం చేస్తూ 9 సంవత్సరాల సమయాన్ని వృధా చేశారన్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్నే పరకాల నియోజకవర్గ ప్రజలు గెలిపించారని పరకాల ఎమ్మెల్యేగా మొలుగూరి బిక్షపతిని ఎన్నుకున్నారని ఉన్న రెండు సంవత్సరాల సమయంలో ఆయన ఏం అభివృద్ధి చేస్తారో ప్రజలు గమనిస్తారని అన్నారు. 3 నెలల్లో తెలంగాణ వస్తాదన్న కెసిఆర్‌ 3 నెలల్లోపే తెలంగాణ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం చలివాగు ప్రాజెక్టు చెక్‌డ్యాం వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, బండి సారంగపాణి, ఎం.డి.రజాక్‌, పొరండ్ల సంతోష్‌, దుప్పటి సాంబశివుడు, బొచ్చు కృష్ణారావు, ఎం.డి.రంజాన్‌ అలి, ఎం.డి.ఖయామొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.