పరకాలలో తెలంగాణవాదాన్ని గెలిపిద్దాం

జయశంకర్‌ ఆశయాన్ని కొనసాగిద్దాం : కోదండరామ్‌

వరంగల్‌ , జూన్‌ 9 (జనంసాక్షి) :

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను సాధిద్దామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజల ఏకైక లక్ష్యమని తెలిపారు. యువత తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోకుండా, ఉద్యమాన్ని    బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణవాదానికి, సమైక్యవాదానికి జరుగుతున్న పోటీలా పరకాల ఉప ఎన్నికను భావించి, తెలంగాణవాదానికే ప్రజలు పట్టం కట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ వనరులను నిలువెల్లా దోచుకున్న సమైక్య పాలకులకు పరకాల ఎన్నిక ఓ గుణపాఠం కావాలని ఆయన అన్నారు.