సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు

` 2018లో కోలిండియానే పెట్టింది
` సింగరేణి 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం
` సంస్థపై దుష్ప్రచారం చేస్తూ కట్టుకథలు అల్లుతున్నారు
` ఎవరి ప్రయోజనం కోసం..ఎవరు చేస్తున్నారు?
` ఒకరు కథనం..మరోకరు లేఖ…ఇంకొకరు విచారణ
` వీరికి ఉన్న సబంధం ఏమిటో ప్రజలకు తెలియాలి
` సింగరేణిపై కిషన్ రెడ్డి విచారణను స్వాగతిస్తున్నాం
` అన్ని వ్యవహారాలపై విచారణ జరగాలి
` మీడియా సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణి పై జరుగుతున్న దుష్పచారాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. సింగరేణి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు రాతలు రాస్తున్నారని, ఈ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? అంటూ ప్రశ్నలు సంధించారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ, కార్మికుల ఆత్మసెí్థర్యాన్ని దెబ్బతీస్తున్నారని డిప్యూటీ సీఎం ఆగ్రహించారు. శనివారం నాడు ప్రజాభవన్‌లో ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై కావాలనే దుష్పచారం చేస్తున్నారని అన్నారు. ’ఒకరు కథనం రాశారు, మరొకరు లేఖ రాశారు, ఇంకొకరు విచారణకు ఆదేశించారు, ఈ ముగ్గురికీ ఉన్న సంబంధం ఏంటి’ అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సింగరేణి అటానమస్ సంస్థ అని, అన్ని నిర్ణయాలు వారే తీసుకుంటారని భట్టి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రావడం, విచారణ జరిపించడాన్న స్వాగతిస్తున్నామని చెప్పారు. సింగరేణిలో తాను వచ్చాకే సైట్ విజిట్ నిబంధన వచ్చిందని ప్రచారం చేస్తున్నారని, నిజాలు బయటకు రావాలని, ప్రజలకు తెలియాలని చెప్ప్పుకొచ్చారు. 2018లోనే సైట్ విజిట్ నిబంధనను కోల్ ఇండియా తీసుకొచ్చిందని, 2021లో ఎనఎమ్‌డీసీ కూడా అమలు చేసిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 2023లో సింగరేణిలోనూ సైట్ విజిట్ కండీషన్ అమల్లోకి వచ్చిందని, సీఎమ్‌పీడీఐ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ తప్పనిసరని ఉందని చెప్పారు. 2018, 2021లో డిప్యూటీ సీఎం భట్టి లేడని, కాంగ్రెస్ లేదని ఆయన గుర్తు చేశారు. దేశంలోని పలు కేంద్ర, రాష్ట్ర సంస్థలు సైట్ విజిట్ అమలు చేస్తున్నాయన్నారు. రైల్వే, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్టీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనూ ఈ నిబంధన ఉందని భట్టి పేర్కొన్నారు. సైట్ విజిట్ ఎక్కడా లేదన్నట్టు దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశంతో రాసిన ఓ కథనం ఆధారంగా ఒక నేత లేఖ రాశారని, అపోహలు పెరుగుతాయని వెంటనే టెండర్లు రద్దు చేశామని భట్టి తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌లకు బీఆరఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారని, దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలోనూ డీజిల్ సప్లయ్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. 2022లో నైనీ బ్లాక్ టెండర్లలో డీజిల్ విధానం మార్చారని వెల్లడించారు. సింగరేణి 25 టెండర్లలో 20 బీఆరఎస్ హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 టెండర్లే జరిగాయని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు సంబంధించిన ఎవరికీ టెండర్లు రాలేదని అన్నారు. సజన్‌రెడ్డితో సీఎంకు సంబంధాలున్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. సజన్‌రెడ్డి కంపెనీ శోధ కన్‌స్టక్షన్ పైవేట్ లిమిటెడ్ అని, ఎండీ దీప్తి రెడ్డి కందాల కూతురు అని, సజన్‌రెడ్డి బీఆరఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడని భట్టి వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అసలు ఏం కావాలని, కేంద్రానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరపాలని తనకు లేఖ రాయాలన్నారు. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేద్దామని అన్నారు. సీఎం రేవంత్ రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. తాను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లో రాలేదని, బొగ్గు బావుల్లో ఏ రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల మానసిక సెí్థర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే.. 20 టెండర్లు బీఆరఎస్ హయాంలోనే జరిగాయని మంత్రి వివరించారు. తెలంగాణ కు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మానసికంగా దెబ్బతీసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా.. కట్టుకథల విషపు రాతలు.. తొలిపలుకు రాతలు.. తప్ప్పుడు ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కథనాలు రాస్తున్నారు. రోజుకో కథ వండి వారిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నింటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడి దారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇటువంటి రాతలతో తెలంగాణకు సంబంధించినటువంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్టాన్రికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు. సింగరేణి నిర్ణయం మంత్రుల దగ్గరికి రాదు.. అటానమస్ సంస్థ ఇది. మంత్రి మండలి దగ్గరకు కూడా రాదు.. ఇంగితం ఉన్న.. విజ్ఞానం ఉన్న వారు ఇలా రాయరు అని తెలిపారు. పారదర్శకంగా ఉండాలి అనుకోవడమే కాదు.. పారదర్శకంగా ఉండాలి అని వెంటనే టెండర్ రద్దు చేయాలి అని చెప్పానని అన్నారు. హరీష్ లేఖ రాయడం.. కిషన్ రెడ్డి విచారణ చేపట్టడం.. మంచిది అయ్యిందన్నారు. కిషన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. అడ్డగోలుగా ప్రచారం చేసే వాళ్ల బతుకు బయట పడాలని అనుకున్నానని అన్నారు.గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది.. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు.

నైనీ బ్లాక్ టెండర్లపై విచారణ
` రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర బందం సభ్యులు
హైదరాబాద్(జనంసాక్షి):నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీ సింగరేణి భవనానికి చేరుకుని విచారణను ప్రారంభించింది. సీఎసఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై కేంద్ర బందం ఆరా తీస్తోంది. సింగరేణి సీఎండీ కష్ణ భాస్కర్ వద్ద ఈ బందం వివరాలు సేకరిస్తోంది. శుక్రవారం రాత్రి 7 గంటలపాటు విచారణ జరిపింది. నేడు మరోసారి విచారణ చేపట్టిన బందం వచ్చే సోమవారం తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. కాగా.. నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్‌లో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన సరికాదని, అక్రమాలకు దారి తీస్తుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సమగ్ర విచారణకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బందంతో కమిటీ ఏర్పాటైంది. బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఈ బందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ బందం సింగరేణిలో పర్యటించి.. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి, ఆ నివేదికను మూడు రోజుల్లో అందజేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

టెండర్లు రద్దు చేయడమంటే..అవినీతి జరిగినట్లే
` అసలు విషయాలు భట్టి ఎందుకు దాస్తున్నారు?
` సీఎం రేవంత్ బావమరిది విషయంలోనూ దాపరికాలు: హరీశ్
హైదరాబాద్(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో నైనీ టెండర్ రద్దు చేశారంటే, స్కాం జరిగినట్లేనని బీఆరఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.నైనీ వ్యవహారంలో మంత్రి భట్టి మసిబూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ స్కాం చేసిన ఆరోపణలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆరోపించారు. శనివారం హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డి బావమరిది కోసమే ఈ తతంగమంతానని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేసారు. విÖరెన్ని సాకులు చెప్పినా విÖ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది నిజం. నేను సూటిగా అడుగుతున్నా. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? నిన్న బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా ప్రెస్ విÖట్ లో మాట్లాడలేదని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు? సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆరఎస్ విÖద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు. జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవని స్పష్టం చేశారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? అది తప్ప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు? ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్ప్పుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు. భట్టి గారూ. విÖరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాసాను. విÖరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం విÖద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హావిÖ ఇస్తే విÖకూ లేఖ రాయడానికి సిద్దమని హరీష్‌రావు స్పష్టం చేశారు.