పర్యాటక రంగాభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి

స్వదేశీ దర్శన్‌ పథకంలో మూడు ప్రాజెక్ట్‌ లు

అసెంబ్లీలో మంత్రి ఈటల

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

సారించినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పర్యాటకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రాష్టాన్న్రి నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. రూ. 140 కోట్లతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమశిల, మహానది, కడివరం తదితర ప్రదేశాలను టూరిజం అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. అటవీ ప్రాంతాల్లో ములుగు మేడారం, తాడ్వాయి తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికోసం కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. స్వదేశీ దర్శన్‌ కింద తెలంగాణ రాష్ట్రం మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలతో పర్యాటక రంగంలో మన రాష్టాన్రికి అనేక అవార్డులు వచ్చాయన్నారు. బతుకమ్మ పండుగలో విదేశీయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నరన్నారు. తిరుమల దేవస్థానం వలె ప్రపంచవ్యాప్త గుర్తింపుకు వందల కోట్లతో యాదాద్రి అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి సభకు వివరించారు. యాదగిరితో పాటు వేములవాడ, కాళేశ్వరం వంటి దేవస్థానాలు సంవత్సర కాలంలో మంచి ఆదరణ పొందుతాయన్నారు.

తాజావార్తలు