పలువురు సినీ ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ (45)కు పలువురు సీనీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాతలు రామానాయుడు, అశ్వనీదత్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, వీబీ రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, సాయికుమార్‌, కీరవాణి, నాగబాబు తదితరులు నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమన్‌ మృతి పట్ల తెలుగు సినిమా నిర్మాతల మండలి సంతాపాన్ని తెలియజేసింది.