పలు గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

ఫోటో రైటప్: ర్యాలీ చేపట్టిన ఎంపీపీ సంతోషం రమాదేవి.
బెల్లంపల్లి, ఆగస్టు13, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని నెన్నెల, మన్నెగూడెం, గొల్లపల్లి గ్రామాల్లో శనివారం 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టినట్లు నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశదిశల వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తించుకొనడానికి ఉద్దేశించబడిన ర్యాలీ లో అన్ని సబ్బండ వర్గాలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, నెన్నెల సర్పంచ్ తోట సుజాత- శ్రీనివాస్, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ- రమేష్, మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు, పంచాయతీ సెక్రటరీలు సాగర్, రంజిత్, రెహానా, మరియు పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఉపాధ్యాయులు ఐకెపి సీఏ లు ,అంగన్వాడీ కార్యకర్తలు, ఆశకార్యకర్తలు, గ్రామపెద్దలు, విద్యార్థులు, పాల్గొన్నారు