పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తండ్రి కుడిది వెంకటేష్‌ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వోకు సమాచారం అందించారు.