పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
కొలంబొ: పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే గంభీర్ డకౌట్ అయినా తర్వాత బ్యాటింగ్ చేసిన కోహ్లీ, సెహ్వాగ్‌లు స్కోరును పరుగులు తీయించారు. కోహ్లి 78, సెహ్వాగ్ 29, యువరాజ్ సింగ్ 19 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లు అఫ్రీదీ, హాసన్‌లు చెరో వికెట్ తీశారు.