పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులను ఆ దేశం విడుదల చేసింది. భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో వీసా సడలింపు నిబంధనలపై ఇరు దేశాల మధ్య ఈరోజు ఒప్పందం జరిగింది. ఈ సందర్బంగా పాకిస్థాన్‌లో జైళ్లలో శిక్ష ముగించుకున్న మత్స్యకారులందనినీ విడుదల చేస్తున్నట్లు ఆదేశ అంతర్గత వ్వవహారాలశాఖ మంత్రి రహమన్‌ మాలిక్‌ తెలిపారు.