పాక్‌లో 315 మంది భారత జాలర్ల విడుదల

కరాచి:ఇరవై మంది నేరస్థులు సహ 315 మంది భారత జాలర్లను పాక్‌ కారాచీలోని మలిర్‌ జైలు నుంచి విడుదల చేసింది.వీరిని లాహోర్‌కి తరలించి అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వాకా గురువారం భారత్‌కు అప్పగించనుంది.పాక్‌లో మరణశిక్ష పడ్డ సరబ్‌జిత్‌ సింగ్‌ విడుదల అంశంపై వివాదం రేగిన మరుసటి రొజే ఈ జాలర్లును విడుదల చేయడం ప్రాధాన్చం సంతరించుకొంది. మంగళవారం పాక్‌ విడుదల చేసిన మరణ శిక్ష పడ్డ దోషి సుర్జీత్‌సింగ్‌ను జాలర్లతో పాటే భారత్‌కు అవకాశం ఉంది.ఈ సందర్భంగా పాక్‌ అంతర్గత భద్రత మంత్రి రెహ్మన్‌ మాలిక్‌ మాట్లాడుతూ జల సరిహద్దులోకి ప్రవేశించి పట్టుబడ్డ భారత జాలర్లను విడుదల చేసుందుకు చర్చలు తీసుకొంటున్నామని వివరించారు.జైలు శావఖ మంత్రి అయాజ్‌ సూమ్రో మాట్లాడుతూ భారత్‌ కూడా పాక్‌ జాలర్లును విడుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.130 మంది కరాచీలోని జైల్లో ఉన్నట్లు సమాచారం