పాక్‌ ప్రధానికి సుప్రీం కోర్టు సమన్లు

ఇస్లామాబాద్‌: పాక్‌ ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌ ఈ నెల 27న తమ ఎదుట హాజరు కావాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. పాకిస్థాన్‌ అధ్యక్షుడు జర్దారీ అవినీతి కేసులపై పునర్విచారణ చేపట్టటంలో విఫలమైనందుకు ప్రధాని తమ ముందు హాజరు  కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అధ్యక్షుడి అవినీతికి సంబంధించి స్విన్‌ ఖాతాల సమాచారాన్ని తెప్పించాలని  విధించిన రెండు వారాల గడవు ముగియటంతో కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. మాజీ ప్రధాని యుసఫ్‌ రజా గిలానీ కూడా ఇదే కేసులో పదవిని పోగుట్టుకున్న విషయం తెలిసిందే.