పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన ప్రధానిగా ఆయనను ఎన్నుకుంది. గురువారం ప్రధానిగా ఎన్నికైన షాబుద్దీన్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావటం తో నేడు ఈయనను ఎన్నుకున్నారు. కానీ అష్రాఫ్‌ (61)పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్‌ మంత్రి గా పనిచేసినపుడు ఆయన పలు అవినీతి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 342 మంది సభ్యులు కల నేషనల్‌ అసెంబ్లీ లో ష్రాఫ్‌ కు 211 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి,పిఎంఎల్‌ ఎన్‌ పార్టీ అభ్యర్థి సర్థార్‌ మెహాతాబ్‌ అహ్మద్‌ ఖాన్‌కు 89ఓట్లు వచ్చాయి. దేశ 25వ ప్రధానిగా అధ్యక్షుడు జర్దారీ ప్రమాణం చేస్తారు.