పాఠశాలలను బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు -కమీషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: బంద్‌ల సందర్భంగా పాఠశాలలను బలవంతంగా మూయించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హెచ్చరించారు. పాఠశాల బస్సులను అడ్డుకోవటం, బస్సుల ధ్వంసం వంటి చర్యలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సైబరాబాద్‌ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వైకాపావారు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో అన్ని బస్‌డిపోల వద్ద పోలీసు పికెట్లను ఏర్పాటు చేశామన్నారు.