పాడి అభివృద్దికి చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌కు లోక భూమారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని  అన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ
పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో మిషన్‌ కాకతీయ ద్వారా దాదాపు 18 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు. దాదాపు 5 వేల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందుతోందని చెప్పారు. ఇకపోతే గ్రామసభల ద్వారా భూమిలేని నిరుపేద దళితులను ఎంపిక చేస్తున్నట్లు
తెలిపారు. దళితబస్తీలో సాగుకు యోగ్యమైన భూములనే కొనుగోలు చేయాలని  సూచించారు.  రైతులతో మాట్లాడి దళితబస్తీ ద్వారా కొనుగోలు చేసిన భూములు పంటలకు యోగ్యంగా ఉన్నాయా అని అడిగి
తెలుసుకున్నారు. ఈ భూములకు సాగునీటి సౌకర్యాన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు.  భూమిలేని నిరుపేదలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఇంకా కొంత మందికి ఒక ఎకరం, రెండు ఎకరాల భూమి ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు.