పాతబస్తీలో అంక్షల సడలింపు…144 సెక్షన్ కోనసాగింపు
ఎవరూ ఎలాంటి అవేశాలకు లోనుకావోద్దని హోంమంత్రి
పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని..సిపి
వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్
హైదరాబాద్ : అల్లర్లు చెలరేగిన హైదరాబాద్ పాతబస్తీలో సాదారణ పరిస్థితులను వెలకోల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్ వద్ద తాత్కాలికంగా అంక్షలను సడలించారు. వాహనాల రాకపోకలకు అనుమతించారు. శాలిబండ, చార్మినార్ వద్ద బారీకెడ్లను తోలగించారు. పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే , భారీగా అదనపు బలగాలను మోహరించారు. బస్తీల్లో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
శుక్రవారం అల్లర్లకు బాద్యులైన 50 మందిని పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు ఉద్రిక్తతల నేపధ్యంలో శనివారం వ్యాపార సంస్థలు తెరిచే విషయంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్‌లోని పాతబస్తీ శుక్రవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఓవైపు ప్రార్థనలు మరోవైపు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అలయం వద్ద పూజల నేపధ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మక్కా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ప్రార్థనల అనంతరం పలువురు అందోళనకారులు పోలీసుల పైన మీడియా పైన రాళ్లు రువ్వారు. పరిస్థితి ఓక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. అయితే అల్లరిమూకలు ఎంతకూ తగ్గక పోవడంతో పోలిసులు బాష్పవాయువును ప్రయోగించారు. అందోళనకారులు మీడియాకు, పోలిసులు చెందిన పలు వాహనాలకు ధ్వంసం చేశారు. మూడు నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు బైకులు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పోలిసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలిసుల అంక్షలను జవదాటారు. ముందస్తు జాగ్రత్తగా పోలిసులు చార్మినార్ పరిసారాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. రాళ్ల దాడిలో ఎసిసి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మరింతమంది పోలీసులను మోహరించారు. సాయంత్రం వరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరూ ఎలాంటి అవేశాలకు లోనుకావోద్దని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రశాంతంగానే ఉందన్నారు. ప్రజలు అందరూ సంయమనంతో ఉండాలని, పరిస్థితి అంతా అదుసులోనే ఉందని అయన చెప్పారు. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని సిపి అనురాగ్ శర్మ చెప్పారు.



