పాతబస్తీలో పరాభవం

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీజేఏసీ  సభలో మార్మోగిన జై తెలంగాణ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి):

సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..హైద్రాబాద్‌ వేదికగా జరుగుతన్న జీవ వైవిధ్య సదస్సు ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టడంపై తెలంగాణవాదుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు..ప్రధాని పర్యటన రోజు నుండి ఎక్కడకు వెళ్లినా సీఎంకు నిరసనలు తప్పడం లేదు..ఓ రోజు తెలంగాణ జర్నలిస్టులు, మరో రోజు జూనియర్‌ లాయర్లు ఎవరైతేనేమి, ఎక్కడైతేనేమి  సీఎంను అడ్డుకొంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..పాతబస్తీలో సీఎంను తెలంగాణ లాయర్లు అడ్డుకొని 24 గంటలు గడవకముందే మరోసారి పాతబస్తీలో సీఎంకు పరాభవం తప్పలేదు..రాజీవ్‌ సద్భావనా దినోత్సవం సందర్భం గా పాతబస్తీలో రాజీవ్‌గాంధీ ఇచ్చిన పిలుపును ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సమాచార రంగంలో, ఇన్ఫర్మేషన్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్‌కు దక్కుతుందని సీఎం అన్నారు. దేశంలో శాంతి నెలకొనేందుకు, భారతీయులందరిలో ఐక్యత తీసుకువచ్చేందుకు రాజీవ్‌ గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర మంచిఫలితాలనుజరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కిరణ్‌ రాగానే తెలంగాణ జేఏసీ నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేశారు..దీంతో ఖంగుతిన్న పోలీసులు తెలంగాణవాదులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణవాదుల వరుస నిరసనల నేపధ్యంలో పోలీసులు ఆందోళన చెందుతున్నారు…రాజధాని నగరంలోనే పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణవాదం బలంగా ఉండే జిల్లాల్లో సీఎం పర్యటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.