పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం

హైదరాబాద్‌: నగరంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ పేర్కొన్నారు. కేంద్ర మైనార్టీ సంక్షేమశఖ మంత్రి నజ్మాహెప్తుల్లాను కలిసిన మహమూద్‌ అలీ ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డును విభజించాలని కోరారు. తెలంగాణ-ఏపీ వక్ఫ్‌బోర్డుల దగ్గర నిధులు బాగానే ఉన్నాయని, బోర్డు విభజన వల్ల రెండు రాషా్ట్రలకూ ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రికి, ఆయన వివరించారు. అజ్మీరా దర్గా దగ్గర తెలంగాణ యాత్రికుల భవనాన్ని నిర్మించడం కోసం ఎకరం భూమిని కేటాయిస్తామని రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే హామీ ఇచ్చారాని నజ్మాహెప్తుల్లాకు, మహమూద్‌అలీ తెలిపారు. హైదరాబాద్‌లో సౌదీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకోసం రేపు కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీతో పాటు సౌదీ రాయబారిని కలుస్తామని మహమూద్‌ అలీ చెప్పారు.