పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు

ఏలూరు, జూలై 31 : ఏలూరు డివిజన్‌లో మూడు వనసంరక్షణ సమితుల్లో 32 వేల పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖా ఏలూరు డిప్యూటి రేంజ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌. శ్రీనివాసరావు చెప్పారు. పెదవేగి మండలం భోగోలు గ్రామంలో 63వ వనమహోత్సవం సందర్భంగా మంగళవారం భోగోలు వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన జామియిల్‌ మొక్కలు నాటారు. 140 మంది వన సంరక్షణ సమితి సభ్యులు 20వేల జామాయిల్‌ మొక్కలను నాటినట్లు శ్రీనివాసరావు చెప్పారు. తడికలపూడి, వీరిశెట్టి గూడెం వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో 12 వేల జమాయిల్‌ మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. జిల్లాలో ఈ సీజనులో 52 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరగిందని, కావున ప్రతి ఒక్కరు విధిగా మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమలో భోగోల వన సంరక్షణ సమితి అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.