పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను

– తనపై దుష్పచ్రారాన్ని నమ్మొద్దు
కెసిఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తా
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రమ శిక్షణ కలిగిన నేతనని, అధినేత కేసీఆర్‌ ఏది చెబితే దానిని ఆచరిస్తూ ముందుకెళ్లడమే తన కర్తవ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో హరీష్‌రావుకు అవకాశం కల్పించక పోవటంతో హరీష్‌రావుపై కేసీఆర్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని, హరీష్‌ రావు తన గ్రూపుతో టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నాడని సోషల్‌ విూడియాలో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌ రావును విలేకరులు సోషల్‌ విూడియాలో జరుగుతున్న దుష్పచ్రారంపై స్పందించాలని కోరారు. హరీష్‌రావు మాట్లాడుతూ.. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారందరికీ తన అభినందనలు తెలిపారు. తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై స్పందిస్తూ, నేను ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు చెప్పానని, టీఆర్‌ఎస్‌ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాంటి కార్యకర్తను అన్నారు. కేసీఆర్‌ ఏది ఆదేశిస్తే, దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తానని హరీష్‌రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సవిూకరణాలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఆయన నాకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని, నాకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. నాపేరిట వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నానని అన్నారు. తన పేరిట ఎటువంటి సోషల్‌ విూడియా గ్రూప్‌ లు లేవని, ఒకవేళ ఎవరైనా అలాక్రియేట్‌ చేసుంటే, వాటిని తొలగించాలని కోరారు. ఎవరైనా కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేయాల్సిందేనని హరీష్‌రావు స్పష్టం చేశారు.

తాజావార్తలు