పార్టీ అధినేత్రికి చివరి లేక : కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చివరిసారిగా లేఖ రాస్తున్నామని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె. కేశవరావు చెప్పారు. అధినేత్రికి రాయబోయే లేఖలో భవిష్యత్తు కార్యాచరణను పేర్కొంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలంగాణవాదులను విభజించేందుకు కోన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామనడం గోప్ప త్యాగమని అభిప్రాయపడ్డారు. అందర్నీ కలుపుకోనిపోయే బాధ్యత కేసీఆర్‌ పైనే ఉందని అన్నారు. 16 లోక్‌సభ స్థానాలు, 90 శాసనసభ స్థానాలు చేతిలో ఉంటే తెలంగాణ సాదించగలమని పేర్కొన్నారు.