పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్న మల్లు స్వరాజ్యం

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. మతోన్మాదం, రైతాంగ సమస్యలు సహా పలు తీర్మానాలను మహాసభలు ఆమోదించనున్నారు. ఈనెల 22న సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..