పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా
సూరజ్‌కుండ్: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ దృష్టిసారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు. మంత్రులు సమర్ధంగా పనిచేసి ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.