పార్టీ మారండి అన్నా..! విూరే మారండి..!
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషన చోటు చేసుకుంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చసాగింది. ఇటీవల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కిన విషయం తెలిసిందే. అయితే అన్నా..మళ్ళీ మా పార్టీలోకొచ్చేయ్ అంటూ వంశీ చందర్‌రెడ్డి ఎమ్మెల్యే భాస్కర్ రావును ఆహ్వానించారు. ఇందుకు స్పందించిన భాస్కర్ రావు.. అందరూ టీఆర్‌ఎస్‌లోకి వచ్చే వాళ్లేనని.. నేను విూకాడికొచ్చి ఏం చేయాలంటూ బదులిచ్చారు. నువ్వు కాంగ్రెస్‌లో ఇంకా ఏం చేస్తావ్.. నువ్వే మాపార్టీలోకి వచ్చెయ్.. యంగ్ లీడర్ కేటీఆర్ టీమ్‌లో నీకు మంచి పొజిషన్ ఉంటుంది అని భాస్కర్ రావు ఎమ్మెల్యే వంశీచందర్‌ను కోరారు.. దీనికి స్పందించిన వంశీ ‘నేను కారెక్కలేను కానీ.. విూరే మా పార్టీలోకి రావాలి’ అని భాస్కర్ రావును ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డి మరోసారి ఆహ్వానించారు. ఇలా వారి మధ్య ఆహ్లాదకర మాటల సంభాషణ సాగింది..