పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు

share on facebook


టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) :

రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కే తారకరామారావు ధన్యవాదా లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కేటీఆర్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత రెండు వారాలుగా  పార్టీ యంత్రాంగం మొత్తం ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని,  ఈ ఎన్నికల్లో పార్టీ చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యావంతులంతా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యలో  కీలకమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని తాము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రతి ఒక్క విద్యావంతునికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Other News

Comments are closed.