పార్ధసారథి శిక్ష ఉత్తర్వుల నిలుపుదల

హైదరాబాద్‌: ఫెరా ఉల్లంఘన కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధికి విధించిన శిక్ష ఉత్తర్వులను నాంపెల్లి న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. కేపీఆర్‌ టలిప్రొడక్ట్‌ సంస్థకు డైరెక్టర్‌ హోదాలో ఫెరా నిబంధనలు ఉల్లంఘంచినందుకు ఆర్థికనేరాల ప్రత్యేక న్యాయస్థానం మంత్రి పార్థసారధికి జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.