పింఛను కోసం నవోదయ సిబ్బంది సమ్మె

హైదరాబాద్‌: నవోదయ విద్యాసంస్థల సిబ్బంది పింఛను సౌకర్యం కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రంలోని నవోదయ పాఠశాలల అధ్యాపకులు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమకు పింఛను సౌకర్యం కల్పించాలని, బోధనేతర సిబ్బందికి అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పలుచోట్ల నవోదయ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తాజావార్తలు