పింఛన్లతో వృద్ధులకు అండ

_ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
_గ్రామగ్రామానికి వెళ్ళి ఆసరా కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కడెం సెప్టెంబర్ 02(జనం సాక్షి )రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లతో ప్రభుత్వం వృద్ధులకు అండ గా నిలిచిందని  ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్  అన్నారు. కడెం మండలం లో నర్సాపూర్,నచ్చనఏళ్లపుర్,మాసాయిపెట్, లింగాపూర్,సారంగాపూర్,ఏలగడప, దిల్ దార్ నగర్, లక్ష్మిసాగర్,పాత మద్దిపడగ,కొత్త మద్దిపడగ,దర్మజిపెట్, కడెం, కన్నాపూర్, కొండుకూర్, చిట్యాల్, పెద్ద బెల్లాల్, చిన్న బెల్లల్,  గ్రామ పంచాయతీ పరిధిలోని పింఛన్‌దారులకు కార్డులు ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం రూ.75 పింఛన్‌ మాత్రమే ఇచ్చే వారని గుర్తుచేశారు. ఇందుకోసం నిరుపేదలు పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,016 చొప్పున అందిస్తుండటంతో వారి మొఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.