*పిఆర్టియు టిఎస్ మండల కార్యవర్గ సభ్యుల ఎన్నిక.
చిట్యాల22(జనంసాక్షి)పిఆర్టియు టి ఎస్ నమోదు వారోత్సవంలో భాగంగా గురువారం మండల అధ్యక్షుడు పంచిక భగవాన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సంఘం అధ్యక్షులు రేగురి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ పాల్గొని కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించారు.
మండల అసోసియేట్ అధ్యక్షులుగా సిరిపురం సతీష్, మహిళ ఉపాధ్యక్షురాలుగా అనిశెట్టి శైలజ, కార్యదర్శి గా చంద్రగిరి రాజేంద్రప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.. అనంతరం జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ సంఘ నియమాలను ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించాడు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికైన సభ్యులు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, జిల్లా సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుభాకర్ రెడ్డి,కిరణ్ కుమార్ మండల శాఖ అధ్యక్షులు భగవాన్ రెడ్డికి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, గౌరవ ప్రాథమిక సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Attachments area