పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని శంకర్‌రావుకు హైకోర్టు సూచన

హైదరాబాద్‌ : ఎర్రచందనం రవాణాపై పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టు సూచించింది. తీసుకోకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎర్రచందనం టెండర్లలో అవకతవకలపై దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.