పీఆర్‌టీయూ అభ్యర్థి ముందంజ

విశాఖ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం గాదె సమీప అభ్యర్థి జి. సింహద్రి అప్పడుపై 1056 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితం సాయంత్రానికి తేలనుంది. పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు చేపట్టారు.