పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం శాటిలైట్లను రోదసిలోకి ప్రవేశపెట్టింది. ప్రొయిటెరస్‌, స్పాట్‌-6, మినిరేడిస్‌ ఉపగ్రహాలు నిర్ణీతీ కక్య్రలోకి ప్రవేశించాయి.18 నిమిషాల 36 సెకన్లలో పీఎస్‌ఎల్వీ-సీ 21 కక్యలోకి ప్రవేశించింది. నాలుగు దశల్లో వాహననౌక నిర్దేశిత కక్యలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష ప్రస్థానం వందో ప్రయోగమైలురాయిని చేరుకుంది. శత ప్రయోగాలు నిర్వహించిన అంతరిక్ష సంస్థగా ఇస్రో చరిత్ర సృష్టించింది. ఈమధుర క్షణాలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు.