పెంచికలదిన్నెలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పెంచికల్ దిన్న గ్రామంలో క్షయ వ్యాధిపై పాఠశాల విద్యార్థులు, వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే క్షయ వ్యాధి కావచ్చు. మన అందరి పంతం -క్షయ వ్యాధి అంతం వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి కలవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్లె పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స తీసుకొని వ్యాధి నుండి వారు రక్షణ పొందటమే కాకుండా సమాజంలో క్షయ వ్యాధి వ్యాపించకుండా సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ వై.సీతామాలక్ష్మి కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మౌనిక,కావేరి,కె .జయమ్మ, ఆర్.జానమ్మ,ఎస్.ఉపేంద్ర, టి.అరవిందమ్మ,ఎస్. రమేష్, శారద, ఆశా కార్యకర్తలు జానకమ్మ,రాణి తదితరులు పాల్గొన్నారు.