పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా 31న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

జనగామ 25 మే, 2012 (జనంసాక్షి) :
పెంచిన పెట్రోల్‌ ధరకుల నిరసనగా ప్రతిపక్షలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పెంచిన పెట్రోల్‌ ధరలలో 3 రూపాయల వరకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్న అంశా న్ని దృష్టిలోపెట్టుకొని ధరలను పెంచడం దించడం ప్రజలను మోసం చేయడమే నని బి.జె.పి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం భాద్యత రహిత విధానాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. పెట్రో ల్‌ ధరలు 7.50 పైలు రూపాయలు పెంచడం దేశ చరిత్రలో ఇదే మెట్టమొదటి సారి అని పేద ప్రజల నడ్డి విరుచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ఎన్‌.డి.ఏ ఆద్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అవినీతి వల్ల ఆర్దిక విధానాల వల్ల విదేశి మారక ద్రవ్య విధానాల వల్ల రూపాయి విలువ పడిపోయిందని ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగా లేదని కేంద్ర ప్రభుత్వ చేతగాని తనం వల్ల ప్రధాన మంత్రి అసమర్థత వల్ల రూపాయి విలువ పడ ిపోయిందని అన్నారు. పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఈ నెల 31న భారత్‌ బంద్‌ను విజయ వంతం చేయాలని కిషన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, నెల్లుట్ల నర్సింహ రావు, కె.వి.ఎల్‌.ఎన్‌ రెడ్డి, ఉడుగుల రమేష్‌, శ్రీనివాస్‌, తదితరలు పాల్గొన్నారు.