పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని జనరల్ ఆస్పత్రి ముందు కార్మికులు ధర్నా.
కార్మికుల శ్రమను గుర్తించక పోవడం దారుణం.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 2 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులకు స్వీపర్ల కు 4 నెలలుగా ధోబీ లకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో దాదాపు 36 మంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బిల్లు కాలేదని నెపంతో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. 330 పడకల ఆసుపత్రిలో కేవలం 36 మంది మాత్రమే పనిచేస్తున్న వారి శ్రమను గుర్తించకపోవడం దారుణమైన చర్య అని ఆయన అన్నారు.అందులో భాగంగా వేల కోట్ల రూపాయలు వైద్య రంగానికి ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రిలో కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉంది అంటే అది కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యమే అని ఆయన అన్నారు. అధునాతన హంగులతో నిర్మించిన జనరల్ ఆస్పత్రిలో 56 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 36 మంది మాత్రమే నియమించి కాంట్రాక్టర్ వారి యొక్క శ్రమను కొద్దిమందితో పని చేస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టాలని వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలమణి కృష్ణవేణి రాధ భాగ్యమ్మ వెంకటమ్మ గిరి శేఖర్ నిరంజన్ కృష్ణయ్య వెంకటయ్య బాలయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.